Jayamalini : డెబ్భైయో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతి లక్ష్మి, జయమాలిని . అప్పట్లో వీరిద్దరు ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయిన వీరి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. నిజానికి జయమాలిని వచ్చాక జ్యోతి లక్ష్మి కి అవకాశాలు తగ్గాయానే చెప్పాలి. మొదటి నుండి సినిమ నేపథ్యం ఉండటం వల్ల జ్యోతి లక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలచార్యా గారు జయమాలినిని చూసి ఆయన తెలుగు సినిమా ‘ఆడదాని అదృష్టం’ లో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని గారు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో హీరోయిన్ గా చేసారు. ఇక జగన్మోహని సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.

చిరంజీవి గారి వల్ల నా ఆఫర్స్ తగ్గాయి….
జయమాలిని గారి ఐటమ్ సాంగ్ కి అప్పట్లో క్రేజ్ విపరీతంగా ఉండేది. పన్నెండేళ్ల వయసులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జయమాలిని హీరోయిన్ గా మంచి హిట్లు చూసినా ఆది కంటిన్యూ చేయలేదు. ఇక ఐటమ్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయిన ఆమె తనకు ముందు నుండి తెలిసిన ప్రతిభన్ అనే పోలీస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకున్నారు.

పెళ్లయ్యాక మళ్ళీ సినిమాల్లో సాంగ్స్ చేయాలని అనుకున్న అప్పటికే చిరంజీవి స్టార్ గా ఎదిగి డిస్కో, క్లబ్ డాన్స్, బ్రేక్ డాన్స్ అంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఆయన డాన్సలకు క్రేజ్ పెరిగి నాకు అవకాశాలు తగ్గిపోయాయి అంటూ చెప్పారు. ఎపుడైనా చిరంజీవి గారిని కలిస్తే ఎందుకు మీరు డాన్సులు చేసి నా అవకాశాలను లేకుండా చేసారని అడుగుతాను అంటూ సరదాగా వాఖ్యణించారు.
































