Jayamalini : డెబ్భైయ్యో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతి లక్ష్మి, జయమాలిని. అప్పట్లో వీరిద్దరూ ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయినా వీరి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. నిజానికి జయమాలిని వచ్చాక జ్యోతిలక్ష్మి కి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. మొదటి నుండి సినిమా నేపథ్యం ఉండటం వల్ల జ్యోతి లక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలాచార్య గారు జయమాలనిని చూసి ఆయన తెలుగు సినిమా ‘ఆడదాని అదృష్టం’లో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో హీరోయిన్ గా చేసారు. ఇక ‘జగన్మోహని’ సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.

జయమాలిని ఆస్తి విలువ ఎంతంటే…
జయమాలిని 13వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినిమాల్లో మొదట హీరోయిన్ గా చేసినా ఆ తరువాత ఐటమ్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యారు. అక్క జ్యోతి లక్ష్మి కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే జయమాలిని కూడా ఐటమ్ సాంగ్స్ కి వచ్చారు. ఇక అప్పట్లో హీరోయిన్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఐటమ్ సాంగ్ చేస్తే జయమాలినికి వచ్చేది. అయితే జయమాలిని గారి ఆస్తి గురించి ఇటీవల ఇంటర్వ్యూలో చెబుతూ తన తల్లి జాగ్రత వల్లే ఇంత కోట్లు విలువ చేసే ఆస్తి వచ్చిందంటూ చెప్పారు.

అప్పట్లో డబ్బు గురించి తెలియదని డబ్బులను జాగ్రత్త చేయడం అవన్నీ అమ్మ చూసుకునేదంటూ చెప్పారు జయమాలిని. తన తల్లికి మూడు బీరువాలకు చీరలు ఉండేవంటూ చెప్పారు. ఒక బీరువా నిండా బంగారం కూడబెట్టిందంటూ చెప్పారు. పిల్లలందరినీ సెటిల్ చేసింది అమ్మే అంటూ తెలిపారు జయమాలిని. తన తల్లి భూమి మీద పెట్టుబడులు పెట్టి నాలుగు ఇళ్ళు కట్టించిందని వాటివల్లే నేటికీ నేను ఎవరి దగ్గర రూపాయి కూడా చేయి చాచకుండా బ్రతుకుతున్నాను అంటూ చెప్పారు. భర్త పోలీస్ ఆఫీసర్, అలాగే కొడుకు విదేశాల్లో చదువుకుని స్థిరపడ్డాడు అంటూ ఆస్తి పాస్తులు కుటుంబం గురించి తెలిపారు.




























