Jayamma Panchayithi : యాంకర్ సుమ లీడ్ క్యారెక్టర్ పోషించిన జయమ్మ పంచాయతీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లపై సినిమా ప్రత్యేక శ్రద్ధ కూడా చూపించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించడం మరో విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయం లో నే ఈ సినిమాకు సుమా తనదైన శైలిలో ప్రమోషన్ మొదలుపెట్టింది. ఈ మధ్యలో థియేటర్ లో నాలుగు చిన్న సినిమాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే మొదటిసారి. శుక్రవారం రోజు జయమ్మ పంచాయతీ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం, భళా తందనానా, మా ఇష్టం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

విశ్వక్సేన హీరోగా వచ్చిన అశోకవనం లో వచ్చిన కళ్యాణం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ల మధ్య వివాదంతో ఈ సినిమాకు ఎంత డబ్బు ఖర్చు చేసినా రానంతగా ప్రమోషన్ జరిగింది. సినిమా విడుదల మూడు రోజులు ముందు వరకు జయమ్మ పంచాయితీ మంచి హైప్ లో వున్నింది. అయితే ఈ వివాదం ముదరడం తో ఒకసారిగా విశ్వక్ సినిమాకు హైప్ పెరిగింది.
జయమ్మ పంచాయితీని దెబ్బకొట్టిన విశ్వక్…..
యాంకర్ సుమ తన సినిమా ప్రమోషన్ కోసం ఎన్ని రోజులు పడ్డ శ్రమంతా ఒక వివాదం తో బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఇండస్ట్రీ వర్గాలు అంత విశ్వక్ కు మద్దతు ఇవ్వడంతో ఈ సినిమా మీద అంచనాలు ఇంకా కొంచెం పెరిగాయి. అంతేకాకుండా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన సాయిధరమ్ తేజ్, సిద్దు జొన్నలగడ్డ, మంచు విష్ణు సినిమా చాలా బాగా ఉంది అని చెప్తు ట్వీట్ చేయడం కూడా సినిమా విజయానికి దోహదపడింది.అదే క్రమం లో ‘జయమ్మ పంచాయతీ’’ గురించి ఎలాంటి టాక్ బయటకు రాకపోవటం మైనస్‌గా మారింది. సినిమా విడుదల అయిన తర్వాత కూడా అశోక వనం లో అర్జున కళ్యాణం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు సినిమాలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు అయినప్పటికీ యూత్ అంత విశ్వక్ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు.ఇలా మొత్తానికి విశ్వక్ తనదైన శైలిలో విజయం సాధించడం తో జయమ్మ పంచాయితీ వెనుక పడింది.



























