Jayasudha : మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో గ్లామర్ హీరోస్ లో సూపర్ స్టార్ కృష్ణ తరువాత హీరో శోభన్ బాబు అందం గురుంచి చాలా ఎక్కువ మంది హీరోయిన్స్ మాట్లాడుకునేవారు. ఫ్యామిలీ హీరో శోభన్ బాబు కెరీర్ లో చాలా డిసిప్లైన్ గా ఉండేవారు, అలానే శోభన్ బాబు మొదటి నుండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. తాను సంపాదించుకున్న ప్రతి రూపాయి వేస్ట్ చేయకుండా భూమి మీద పెట్టుబడి పెట్టేవారు. ఇక వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో, చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

ఇక అసలు విషయానికి వెళ్ళితే, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్ లో, సహజ నటి జయసుధ గ్లామర్ హీరో శోభన్ బాబు గురుంచి కొన్ని విషయాలు తెలిపారు. హీరో శోభన్ దగ్గర నుండి మీరు ఒక్క విషయం నేర్చుకోలేకపోయాను. ఇక నా సినీ కెరీర్ మాక్సిముమ్ ఎక్కువ సినిమాలు ఆయనతోనే చేసాను కానీ, ఒక్క విషయం మాత్రం ఆయనను ఫాలో అవ్వలేకపోయాను అది ఏమిటి అంటే సహజ నటి జయసుధ – హీరో శోభన్ బాబు ది హిట్ కాంబినేషన్, వీరిద్దరి హిట్ కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. అలానే హీరో శోభన్ బాబు సరసన హీరోయిన్ గా జయసుధ చాలా ఎక్కవ సినిమాలు చేసింది.

ఇక సినీ ఇండస్ట్రీ లో తాను సంపాదించిన డబ్బుని దేని మీద పెట్టుబడి పెట్టితే ఎక్కువ లాభం వస్తుంది అనే విషయంలో హీరో శోభన్ బాబు చాలా ముందు చూపుతో ఉండేవారు. ఇక శోభన్ బాబు తాను సంపాదించిన ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టేవారు. ఇక ఒకానొక సమయంలో ఒక షూటింగ్ నిమిత్తం హీరో శోభన్ బాబు – హీరోయిన్ జయసుధ ఒకే కారు లో ప్రయాణించే సమయంలో ” హీరో శోభన బాబు జయసుధ తో ఏమోయ్ నేను ఒకటి చూపిస్తాను ఇది చూడు అని దారి మధ్య లో ఉన్న ఖాళీ స్థలాన్ని చూపించేవారు, ఈ స్థలాన్ని చూపించి మీ నాన్న గారితో మాట్లాడి దీన్ని కొనుక్కో అని చెప్పేవారు.

ఆ తరువాత జయసుధ భర్త ఆ స్థలాన్ని చూసి ఈ స్థలాన్ని చూస్తే ఇక్కడంతా డంపింగ్ యార్డ్ లాగా ఉంది దీని మీద ఇన్వెస్ట్ చేయమంటున్నారు అని అంటే, చూడు ఇప్పుడు ఉన్న ఈ స్థలం ముందు రోజుల్లో చాలా బాగా ఒక మంచి ప్రదేశం లాగా మారిపోతుంది అని చెప్పేవారు, అప్పుడు ఆ మాటలను నేను పట్టించుకోలేదు ఇప్పుడు ఆ స్థలం కాస్త మద్రాస్ లో అందానగర్ గా ఈరోజున ఎన్నో కోట్లు పలుకుతుంది, ఒక పెద్ద మహానగరం లాగా మారిపాయింది. హీరో శోభన్ బాబు గారు నాకు భూమి మీద పెట్టుబడి పెట్టు అని సలహా ఇచ్చేవారు, కానీ ఈ ఒక్క విషయం లో మాత్రం నేను ఫాలో అవ్వలేకపోయాను అని తెలిపింది ..

అలానే ఇక ఇదే ఎపిసోడ్ లో హీరోయిన్ గా మీరు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు సినిమాలు ఎందుకు ప్రొడ్యూస్ చేసి నష్టపోయారు అని అడగ్గా, అలానే మహానటి సావిత్రి కూడా సినిమాలు చేసి నష్టపోయింది కదా, మరి మీరు సావిత్రి సినిమాల్లో నష్టపోయిన విషయం తెలిసి మీరు ఎలా సినిమాలు నిర్మించి నష్టపోయారు అని జయసుధ ని ప్రశ్నించగా ? దానికి సమాధానముగా హీరోయిన్ జయసుధ నేను హీరోయిన్ సావిత్రి గారితో కొన్ని సినిమాల్లో నటించాను. అలానే సావిత్రి గారు ఆల్కహాల్ కి బానిస అయ్యారు అని తెలుసు కానీ, ఇలా సినిమాలు నిర్మించి నష్టపోయిన విషయం నాకు తెలియదు, లేకుంటే నేను కూడా సినిమాలను నిర్మించాలనే ఉద్దేశం నాకు ఉండేది కాదు అని తెలిపింది ..



























