చిరంజీవిని మెగాస్టార్ కాదు అనేంత ధైర్యం ఎవరికీ ఉంది అనే కదా మీ డౌట్..? అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలను ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే తడుముకోకుండా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాజగా “చిరంజీవి మెగాస్టార్ కాదు” అంటూ జేడీ చక్రవర్తి రాసిన ఒక లేఖ వైరల్ అవుతుంది. ఆ లెటర్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర అంశాలు చెప్పారు జెడి చక్రవర్తి.

“డియర్ చిరంజీవి.. నేను మీ అభిమానినే కానీ.. మీ అనుచరుడిని కాదు. ఎప్పటినుంచో మిమ్మల్ని నేను నటుడినే ఇష్టపడే వాడ్ని. ఒకప్పుడు నాతోటి నటులంతా సాయంత్రం అయ్యేసరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపటానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు. కానీ నేనెప్పుడూ రాలేదు. రావాలనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ. కరోనా కారణంగా వచ్చిన నష్టం అంతా ఇంతా కాదు.. లాక్ డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమకుడా ఎన్నడూ లేని విధంగా నష్టాలను చవిచూస్తోంది.. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టాలపాలయ్యారు.

అందులో నాతో పాటు మీరు కూడా ఉన్నారు.. మనం కూడా ఎంతో కొంత కోల్పోయాం.. ఈ విపత్కర సమయంలో కరోనా క్రైసిస్ ఛారిటీ పెట్టి ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం. మీ అభిమానులే కాదు.. అందరూ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో.. నమ్ముతారో చెప్పడానికి ఇదే నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ.. ఓ గొప్ప వ్యక్తి అని చెప్పాలి. కొందరు సినీ కార్మికులు నాకు ఫోన్ చేశారు. ఈ సమయంలో చిరంజీవి గారు లేకపోయుంటే నిజంగానే ఆకలితో చనిపోయేవాళ్ళం అని, తమ కుటుంబాలకు ఇప్పుడు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, అదంతా మెగాస్టార్ చిరంజీవి గారి చలువే అని.. చిరంజీవి గారు లేకపోయింటే.. తమ కుటుంబాలు రోడ్డున పడేవని చెబుతున్నారు

మీ చుట్టూ ఉన్న వారందరు ఆనందగా ఉండాలని భావించే మీ వ్యక్తిత్వం చాలా గొప్పది. ఇప్పటి నుంచి నేను.. మీకు అభిమానినే కాదు.. ఇకపై మీ అనుచరుడిని కూడా… మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నా.. ప్రేమిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని’. అని ఇంకా ఎన్నో విషయాలు తెలియజేస్తూ జేడీ.. మెగాస్టార్‌కు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..



























