Jeevitha Rajashekhar : జీవిత రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జీవిత రాజశేఖర్ తాజాగా రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘శేఖర్’ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వీరి కుమార్తె శివాని రాజశేఖర్ కూడా నటించింది. ఈ చిత్రన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, శివాని రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 20న విడుదల చేయనున్న సందర్భంలో సినిమా ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ జీవిత రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు.

దర్శకత్వం మీద ఆసక్తి లేకపోయినా శేషు సినిమా ద్వారా తప్పని పరిస్థితుల్లో దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. మలయాళంలో హిట్ సాధించిన జోసెఫ్ సినిమాను శేఖర్ పేరుతో తీయాలన్న ఆలోచనతో ‘పలాస’ డైరెక్టర్ కరుణ కుమార్, నీలకంఠను కలవడం జరిగింది వారు బిజీగా ఉండటం కారణంగా నేనే ఈ సినిమాను డైరెక్షన్ చేశాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ‘శేఖర్’ లాంటి వాడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాడు అనేలా ఈ మూవీ అందరికి కనెక్ట్ అవుతుంది, అని జీవిత చెప్పారు.

వాళ్ళే థంబ్నేయిల్స్ పెట్టి దూరాన్ని పెంచుతున్నారు….
ఈ మీడియా సమావేశం లో మెగాస్టార్ తో గొడవల గురించి ప్రస్థావించగా… అందుకు జీవిత మాకు ఎవరితోనూ ఏ గొడవలు లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని రిపీట్ చేస్తూ.. యూట్యూబ్ వాళ్లే థంబ్నేయిల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని, గొడవల్ని పెంచుతున్నారు’, అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ…. రాజశేఖర్ గారు నెగిటివ్ రోల్స్ లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా…ధ్రువ” లోని అరవిందస్వామి లాంటి పాత్ర , పెదరాయుడులోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్టచబుల్ పాత్ర వస్తే తప్పకుండ చేస్తారని, చిరంజీవి తో కలసి నటించడానికి కూడా సిద్ధం అని చెప్పారు. అంతే కాదు తాను మంచి పాత్రాలు వస్తే నటిస్తానని తెలియజేసారు.































