Jogi Naidu : రవితేజ చేయనన్నాడని పవన్ కళ్యాణ్ ని కలిస్తే… ఆయన షాక్ ఇచ్చాడు… వంశీ, బాపు దర్శకత్వంలో సినిమాలు ఆగిపోడానికి కారణం…: జోగి నాయుడు

0
26

Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లి విడాకుల వల్ల పిల్లలు ఇబ్బందుల్లో పడుతారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సినిమాలు ఆగిపోడానికి కారణం…

జోగి నాయుడు ఆర్టిస్ట్ అయ్యాక జోగి బ్రదర్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఎదిగిన జోగి నాయుడు స్వంతంగా స్టూడియో పెట్టేసారు. అయితే స్టూడియో పెట్టాక సినిమాలను నిర్మించాలని అనుకున్నారు అలా పెద్ధ వంశీ గారితో కథ కుదిరాక షూటింగ్ కి వెళ్లాల్సిన సమయంలో సినిమా ఆగిపోయిందట.

ఇక బాపు గారి దర్శకత్వంలో ‘మంత్రి గారి వియ్యంకుడు’ సినిమాను రీమేక్ చేయాలని అది కూడా రవితేజ హీరోగా చేయాలని అనుకుని బాపు గారిని ఒప్పించి రవితేజ వద్దకు వెళితే మొదట చేయాలని అనుకున్నా ఆపైన బిజీగా అయిపోవడంతో పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకుని వెళ్లి చెబితే ఆయన నాగబాబు కూడా ఇలాంటి ఒక రీమేక్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పడంతో అలా ఆ ప్రొజెక్ట్ పోయింది అంటూ చెప్పారు.