Journalist bhardwaja : సీనియర్ ప్రొడ్యూసర్ ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను తీసిన అశ్విని దత్ ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత ‘ప్రాజెక్ట్ కే’ సినిమా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ తో తీసిన ‘శక్తి’ సినిమా వల్ల కోలుకోలేక పోయిన అశ్వినిదత్ మళ్ళీ సినిమా వైపు చూడలేదు. ఇక ఆయన సినిమా ప్రస్థానం గురించి అలాగే ఆయన సక్సెస్ ఫార్ములా గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

శక్తి తో కోట్లు పోగొట్టుకున్నాడు…
అశ్విని దత్ చదువుకునే రోజుల్లో సినిమాల మీద మక్కువతో చదువయిపోగానే సినిమా నిర్మించాలని ఇండస్ట్రీకి వచ్చారు. మొదట ‘ఒక సీత కథ’ అనే సినిమాకి ప్రొడ్యూసర్స్ లో ఒక భాగస్వామి గా చేరి ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. ఇక ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తరువాత ‘ఎదరులేని మనిషి’ సినిమాను ఎన్టీఆర్ గారితో తీసారు అశ్వినిదత్. అప్పుడే బ్యానర్ పేరు వైజయంతి బ్యానర్స్ గా ఎన్టీఆర్ నామకరణం చేసారు. ఇక ఆ సినిమా సుపర్ హిట్ అవ్వడం ఆ తరువాత ‘యుగపురుషుడు’ సినిమాను మళ్ళీ ఎన్టీఆర్ బాపయ్య కాంబినేషన్ లో తీసి హిట్ కొట్టాడు. ఆ తరువాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా చేయలేదు. అయితే కృష్ణ-కృష్ణం రాజు, శోభన్ బాబు-కృష్ణ ఇలా ఇద్దరు హీరోలతో ముట్లి స్టారర్ సినిమాలను తీసి హిట్లు కొట్టాడు.

ఇక కాంబినేషన్ సెట్ చేయడంలో అశ్విని దత్ తరవాతే ఎవరైనా అనేంతలా సినిమాలో హీరో హీరోయిన్ల ఎంపిక ఉండేది. ఒక పెద్ద బ్యానర్ గా ఉన్న వైజయంతి మూవీస్ లో ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాను తీశారు. ఆది మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత శక్తి పీఠాల కాన్సెప్ట్ తో వచ్చిన ‘శక్తి’ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ సినిమా చేయవద్దని అయన భార్య హెచ్చరించినా అశ్వినిదత్ వినలేదట. ఇక అ సినిమా కోట్లలో నష్టాలు మిగల్చడం వల్ల మళ్ళీ ఇక సినిమా చేయాలని అయాన అనుకోలేదు. అయితే ఆయన కూతుర్లు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో పర్వాలేదానిపించారు. ఆ తరువాత ‘మహానటి’ ఇక ఇప్పుడు ‘సీతారామం’ ఇలా వరుసగా మంచి క్లాసిక్ మూవీస్ ను అందిస్తు తండ్రికి తగ్గ కూతుర్లని అనిపించుకుంటున్నారు.



























