“ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR” షో తో ఏంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్న జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి ఈరోజు ఉదయం కన్నుమూసారు. కరోనా తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఒక యూట్యూబ్ చానెల్ ద్వారా “ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR” షోతో తెలుగు ప్రేక్షకుల్లో అయన ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నారు. షో లో అయన అడిగే ప్రశ్నలు ఏంతో ఆశక్తికరంగా, హుందాగా కూడా ఉంటాయి. విలువలతో కూడిన జర్నలిస్టులలో TNR ఒకరు. అయన జర్నలిస్టు గానే కాకుండా తెలుగు సినిమాలలో నటుడిగా కూడా అయన మంచి పాపులారిటీ సంపాదించారు.. TNR మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వక్తం చేస్తున్నారు.