Jr.NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ ఎంతో అద్భుతంగా నటించి పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకొని ఇక ప్రస్తుతం ఈ సినిమాని జపాన్ భాషలో కూడా విడుదల చేశారు.

అక్టోబర్ 21వ తేదీ జపాన్ లో ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం జపాన్ లో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమా జపాన్లో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. రాజమౌళితో పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లారు. ఇక జపాన్ లో ఇద్దరి తెలుగు హీరోలకు ఎలాంటి ఆధారాభిమానాలు దక్కాయో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత జపాన్ లో కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో చిత్ర బృందంఒక కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదటిసారి జపాన్ భాషలో మాట్లాడుతున్నాను ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

Jr.NTR: అన్నా నీకు ఇంకా ఏ ఏ భాషలు వచ్చు…
నేను మొదటిసారి జపాన్ కి వచ్చాను జపాన్ కి రాగానే నా మనసులో ఎన్నో తిరుగుతున్నాయి. జపాన్ కి వచ్చాక ఈ దేశం పై నా పూర్తి అభిప్రాయం మారిపోయింది. ఇక్కడ ఎంతో మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు.ఇక్కడున్న వారందరిని తాను ఎంతగానో అభిమానిస్తున్నానని జపాన్ తనకు చాలా బాగా నచ్చింది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.ఇలా ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు అన్నా నీకు ఇంకా ఏ ఏ భాషలు వచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.





























