యూట్యూబ్‌లో ఈ మధ్యకాలంలో సంచలన కామెంట్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు వివాదాస్పద సినీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. మెగా స్టార్ చిరంజీవి దగ్గర నుండి బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో పాటు పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్, అల్లు అర్జున్ ఇలా ఓ ఒక్క హీరోని వదలపెట్టకుండా బండ బూతులు తిడుతూ.. నోటి కొచ్చి మాట్లాడుతూ వివాదాలతో సోషల్ మీడియాలో సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ గా మిగిలిపోయారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇతని వాగుడు చూసి డైరెక్ట్ అటాక్‌కి దిగేందుకు ప్రయత్నించగా.. ఇతన్ని పిచ్చోడిగా తేల్చేసి ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు.

అయితే తాజాగా రాకేష్ మాస్టర్ ఇఫ్పుడు మరో సమస్యలో చిక్కుకున్నాడు. అచ్చం తనలా ఉండే పుల్లయ్యను, జూనియర్ రాకేష్ మాస్టర్ గా యూట్యూబ్ తెరకు పరిచయం చేసిన సీనియర్ రాకేష్ మాస్టర్ అంతటితో ఆగకుండా పుల్లయ్యకు డ్యాన్సు పాఠాల పేరుతో కొన్ని వీడియోలను కూడా అప్ లోడ్ చేశాడు. అయితే లేటెస్ట్ గా జూనియర్ రాకేష్ మాస్టర్ గా పాపులరైన పుల్లయ్య రాకేష్ మాస్టర్ నుంచి విడిపోవడమే కాకుండా నోటికొచ్చిన బండబూతులతో సీనియర్ రాకేష్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ పుల్లయ్య కామెంట్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. పుల్లయ్య గురువైన సీనియర్ రాకేష్ మాస్టర్ పచ్చితాగుబోతు అని, కేవలం యూట్యూబ్ షోల కోసమే దాన ధర్మాలు చేస్తాడని, తన జీవితాన్ని రాకేష్ మాస్టర్ నాశనం చేశాడని, తాను కర్నూలులోని ఓ గ్రామంలో ఉన్నప్పుడు, కనీసం నెలకు తక్కువలో 15 వేలు సంపాదించేవాడినని, అయితే రాకేష్ మాస్టర్ దెబ్బకు తన జేబులో ఇప్పుడు ఒక్క రూపాయి కూడా బికారినైపోయానని తన మనో వేదనను తెలియజేశాడు పుల్లయ్య. గతంలో సీనియర్ రాకేష్ మాస్టర్ ను ఇంటర్వ్యూ చేసి ఘోరంగా అవమానానికి గురైన యాంకర్ అలంకృత ఈసారి అతని శిష్యుడైన పుల్లయ్యను ఇంటర్వ్యూ చెయ్యడం విశేషమని చెప్పాలి. ఈ ఇంటర్వ్యూలో సీనియర్ రాకేష్ మాస్టర్ నిజ స్వరూపం గురించి పుల్లయ్యను గుచ్చి గుచ్చి అడిగి అన్ని విషయాలను తెలివిగా బయటకు రాబట్టింది. నిత్య తాగుబోతు అయిన రాకేష్ మాస్టర్ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదంటూ పుల్లయ్య తన గురువు రాకేష్ మాస్టర్ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసేశాడు. మరి పుల్లయ్య కామెంట్స్ కి సీనియర్ రాకేష్ మాస్టర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.



























