Connect with us

Featured

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ని కాపాడగలడా..? అయితే అది ఎంతవరకు..??

Published

on

నందమూరి నట వారసుడు.. తాతకి తగ్గ మనవడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.. చంద్రబాబు వయసు అయిపోయిన వేళ.. లోకేష్ శక్తి సామర్థ్యాలు తెలిసిన వేళ జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ నేతలు జపం చేస్తున్నారు. కానీ టీడీపీని నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా?చంద్రబాబు, లోకేష్ ను మించి టీడీపీని జూనియర్ బతికించగలడా? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.? జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు చేపడితే టీడీపీని లీడ్ చేయగలడు.. కొన్నేళ్లు సరిగ్గా నడిపించగలడు.. కానీ దాన్ని విజయతీరాలకు చేర్చలేడని.. సీఎం పీఠం అధిరోహించలేడని అంటున్నారు.

ఎందుకంటే దిగ్గజాలైన చిరంజీవి, పవన్ కే సాధ్యం కానీ ఏపీ సీఎం పదవి అంత పాపులర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ తో సాధ్యమవుతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న? చంద్రబాబు, లోకేష్ శక్తి సామర్థ్యాలపై చాలా మంది టీడీపీ సీనియర్లు అపనమ్మకంతో ఉన్నారు. ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు సైతం లోకేష్ పై కామెంట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినదించారు. పార్టీని రక్షించడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలంటున్నారు. తెలుగుదేశం బాహుబలి ఎన్టీఆర్ అంటున్నారు.. మరోవైపు చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చడం జూనియర్ ఎన్టీఆర్ వల్ల కాదని అంటున్నారు. చంద్రబాబు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కు పట్టాభిషేకం చేస్తే తప్ప ఆయన చేతుల్లో పోయే చాన్స్ లేదు. లోకేష్ ఉండగా.. బాబు జూనియర్ కు అస్సలు పట్టాభిషేకం చేయలేడు. అలా చేస్తే లోకేష్ అసమర్థుడు, అనర్హుడు అని.. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కు తనే సమాధి చేసినవాడు అవుతాడు. కొడుకును అక్కరకు రానివాడిగా మార్చేసిన వాడవుతాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాకుండా తండ్రీకొడుకులు పటిష్టమైన కోటగోడలు నిర్మించారనే చెప్పొచ్చు.

దీన్ని మునిగిపోయే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా లోకేష్ చేతుల్లోనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టేకప్ చేయడం అంత ఈజీ కాదు.. తిరుగుబాటు చేసే వారంతా వేరే పార్టీలోకి వెళ్లడం.. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ మరో పార్టీ పెట్టడం తప్పితే టీడీపీని చేజిక్కించుకొని ఏలడం జూనియర్ వల్ల కాదంటున్నారు.ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వల్లనే రాజ్యాధికారం సాధ్యం కావడం లేదు. వారితో పోల్చితే జూనియర్ ఎన్టీఆర్ కు మరింత కష్టం. సో ఇప్పుడు టీడీపీని బతికించగల సామర్థ్యం ఎన్టీఆర్ కు లేదని చెప్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు…!!

Advertisement

Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!