Justice NV Ramana : దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్ట్. అలాంటి సుప్రీం కోర్ట్ కి అత్యున్నత స్థానం చీఫ్ జస్టిస్ గా ఉన్న వ్యక్తి మన తెలుగువాడు అవడం గర్వకారణం. ఎన్వీ రమణ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా దర్శకుడు రాఘవేంద్రరావు పుస్తకావిష్కరణకు వచ్చారు. అక్కడ తెలుగు సినిమాగురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు. ఇపుడు ఈ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా స్థాయి పెరిగింది కానీ….
ఈ మధ్య తెలుగు సినిమా ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకుంది. పాన్ ఇండియా సినిమా పేరు బాగా పాపులర్ అవుతున్న ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాలుగా తెలుగు సినిమాలు అంతే రేంజ్ లో హిట్ కొడుతున్నాయి. ఓ వైపు నేరుగా బాలీవుడ్ సత్తా చాటుతూ మరో వైపు రీమేకులుగాను సత్తా చాటుతున్నాయి. తెలుగు సినిమాలు సినిమా స్టాండర్డ్స్ ను పెంచాయి కానీ తెలుగు సినిమా స్టాండర్స్ మాత్రం పడిపోయాయని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు కేవలం కొంత కాలం మాత్రమే వినోదం ఇచ్చేలా ఉన్నాయని గతంలో లాగా సినిమాలు గుర్తుండిపోయే స్థాయిలో రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు బి ఏ రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేసారు . తెలుగు సినిమాను తెలుగు సబ్ టైటిల్స్ తో చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన చేసిన ఈ వాఖ్యలు ఇపుడు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. నిజానికి ఈ మధ్య సీనియర్ నటుడు కోటా కూడా ఈ తరహా వాఖ్యలే చేసారు. ఎక్కువ కాలం గుర్తుండిపోయే సినిమాలు లేవని అప్పటికప్పుడు హిట్లుగా మాత్రమే సినిమాలు ఉంటున్నాయని తెలిపారు.



























