K. Vishwanath: రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ గురించి అందరికి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్చరణ్ వాళ్ళ విశ్వరూపం చూపించారు. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు అందరూ ఎన్టీఆర్ నటన కు అందులోనూ ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని తెలియజేసారు. అయితే ఇటీవల సీనియర్ నతుడు కోటా శ్రీనివాసరరావు కూడా ఈ లిస్ట్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే.

కోటా ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ లో గొప్ప నటుడు వున్నాడు అని.. తను డైలాగులు అద్భుతంగా చెబుతాడు, డ్యాన్స్ లు బాగా చేస్తాడు, వాళ్ల తాత అయిన పెద్ద ఎన్టీఆర్ ను కూడా మరిపిస్తున్నాడు. అతనిలో ఉన్న పొటెన్షియాలిటీ మరే హీరోలోను నేను చూడలేదు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి కళాతపస్వి విశ్వనాధ్ గారు చేరిపోయారు. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమా చుసిన ఈయన ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.
ఎన్టీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందనలు….

ఆర్ ఆర్ ఆర్ సినిమా చుసిన విశ్వనాధ్ గారు ఇలా మాట్లాడారు….ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనపరిచాడు అంటూ ఆయన చెప్పారు. ఇక కొమరం భీముడో పాటలో అయితే ఎన్టీఆర్ నటనకి, ఆయన కనబరిచిన హావ భావాలకి ఫిదా అయిపోయినట్టు ఆయన తెలియచేసారు. సినిమా చూసిన వెంటనే ఆయనే ఎన్టీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించారట. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో నటీనటులు ఎంత గొప్పగా నటిస్తారో తెలిసినదే . అంతటి విశ్వనాథ్ గారు వంటి గొప్ప దర్శకులు, ఎన్టీఆర్ ని పొగడడం తో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉందని బాధపడిన అభిమానులు అందరూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించడం తో కాస్త సంతోష పడుతున్నారు.
































