K Viswanath: తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కె విశ్వనాథ్ గారి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విశ్వనాథ్ గారు ఫిబ్రవరి రెండవ తేదీన వయోవృద్ధప్యా సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా విశ్వనాథ్ గారు మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలో ఆయన కుటుంబంలోనే విషాదఛాయలు అలముకున్నాయి. అయితే విశ్వనాధ్ గారు మరణించిన కొద్ది రోజులలోనే ఆయన సతీమణి జయలక్ష్మి గారు మరణించడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదివారం ఉన్నఫలంగా జయలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇలా అస్వస్థతకు గురైన జయలక్ష్మి గారిని కుటుంబ సభ్యులు చూసి తనని వెంటనే మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇలా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయలక్ష్మి తుది శ్వాస విడిచారు. జయలక్ష్మి మరణించడంతో విశ్వనాథ్ గారి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.

K Viswanath: అనారోగ్యంతో మరణించిన జయలక్ష్మి…
ఇక విశ్వనాథ గారు ఇండస్ట్రీలోకి రాకముందే జయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఓ కుమార్తె.విశ్వనాథ గారు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇండస్ట్రీలోకి రాలేదు. వారికి ఇష్టమైన రంగంలో వారు స్థిరపడ్డారని ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారు వెల్లడించారు. అయితే రోజుల వ్యవధిలోనే ఇలా విశ్వనాథ్ గారి దంపతులు మరణించడంతో కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు.





























