KA Paul : తెలంగాణ రాజకీయమంతా గత కొన్ని రోజులుగా మునుగోడు బై ఎలక్షన్ మీదే ఉంది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఉప ఎన్నికలు అయిపోయాయి. ఎప్పటిలాగే అధికార పక్షమే ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. తెరాస ముదటి ప్లేసులో లో నిలబడితే బీజేపీ రెండో స్థాసన్సలో నిలబడి చివరి వరకూ తెరాస కి గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజా శాంతి పార్టీ మాత్రం ఎలక్షన్స్ లో అవకతకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

ఓట్లు నాకే పడ్డాయి కానీ తెరాస గెలిచింది…
ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ ఓట్ల లెక్కింపు తరువాత మాట్లాడుతూ తెరాస బీజేపీ కలిసి కుట్ర చేసారని ఆరోపించారు. మునుగోడు లో చదువు లేని వారు తరువాత నిరుద్యోగులు చాలా మంది యువత 40 నుండి 60 శాతం వరకు మా పార్టీ కి ఓట్లు వేసారంటూ ప్రెస్ మీట్ లో పాల్ చెప్పారు. అయితే ఈవీఎం లతో ఎలక్షన్ జరపవద్దని ఎప్పటి నుండో చెబుతున్నా పట్టించుకోవడం లేదు, తెరాస బీజేపీ కలిసి ఈవీఎం టాంపరింగ్ చేసారని, పోలీసులు పక్కా తెరాస పార్టీ కార్యకర్తలుగా వ్యవహారిస్తున్నారు అంటూ ఆరోపించారు.

అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలోనే బ్యాలెట్ పేపర్ వాడుతుంటే ఇండియా లో ఈవీఎం అవసరమా అంటూ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు బ్యాలెట్ తో ఎన్నికలు జరిగితే ఓట్లన్నీ మా పార్టీ కే పడతాయి అంటూ చెప్పారు. అన్ని సాక్ష్యధారాలతో కోర్ట్ లో ఈ ఎన్నికల ఫలితం మీద కేసు వేస్తాను నూరు శాతం ఈ ఎన్నిక తప్పు అని నిరూపిస్తాను అంటూ చెప్పారు.





























