Kaarthika Deepam : సినిమాల్లో ఆ సీన్స్ ఏంటి అలా ఉన్నాయి. సెకండ్ హఫ్ ఎంత ల్యాగ్ చేసాడు మరీ డైరెక్టర్.. ఈ మాటలు కేవలం సినిమాలకు మాత్రమే సీరియల్స్ కు వర్తించవు. సినిమాల విషయంలో ఒక్క నిమిషం సాగదీతను కూడా ఇష్టపడని వాళ్ళు యుగాలు గడుస్తున్నా, ముగ్గు పెట్టే హీరోయిన్ ముగ్గు పెడుతూనే ఉన్నా ఆ సీరియల్ ను కన్నార్పకుండా చూస్తారు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఒక ఎపిసోడ్ మిస్ అయినా ఉందిగా ఓటీటీ వెంటనే చూసేయాల్సిందే. పోనీ ఒక్క ఎపిసోడ్ చూడకపోతే సీరియల్ లో ట్విస్టులు మిస్ అయిపోతామా అంటే నెలల పాటు ఒకే సన్నివేశాన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో ఒక్కొక్కరి పేస్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ హిట్ అయిన సినిమా బిజీఎంలు వేస్తూ చంపేస్తుంటారు. అంతకు మించి ఏమి ఉండకపోయినా ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండా ఉండే పరిస్థితి కాదు చాలా మంది సీరియల్స్ లవర్స్ ది. ఇక సీరియల్స్ లో వాళ్ళను మన ఇంటి సభ్యులు అనుకునే జనం కూడా ఉంటారు.

మళ్ళీ వంటలక్క ఎంట్రీ, ఖుషి అవుతున్న ఫ్యాన్స్…
సీరియల్స్ లో కూడా బాగా హిట్ అయిన ఒక సీరియల్ ఉంది అదే వంటలక్క, డాక్టర్ బాబు సీరియల్ అదేనండి ‘కార్తీక దీపం’. ఎన్ని కార్తీక మాసాలు వచ్చి పోయినా మా టీవిలో వచ్చే కార్తీక దీపం మాత్రం వెలుగితూనే ఉంటుంది. అందులో వంటలక్క, డాక్టర్ బాబు మాత్రం కలవనే కలవరు. ఏంటో పాపం వంటలక్క పాత్ర మరీ ఇన్ని కష్టాల అంటూ సీరియల్ ని చూస్తారే కానీ బోర్ కట్టదు జనాలకు. ఇదే ఈ పాయింట్ పట్టుకుని ఆ సీరియల్ డైరెక్టర్ జనాలతో ఆడుకుంటున్నాడు.

కార్తీక్, దీప అపార్థాలు పోయి కలిసి పోయాక చనిపోయినట్టు చూపించాడు డైరెక్టర్. ఇక వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళగా మారి మరో కథ వస్తుంది అనే టైములో మళ్ళీ బుర్రలో ఏమి తొలిచిందో కానీ డైరెక్టర్ కి మళ్ళీ కార్తిక్, దీప బతికే ఉన్నట్లు చూపించాడు. ఇంతలా లాజిక్ లేకుండా చూపించినా ప్రేక్షకులు మాత్రం అబ్బా.. మళ్ళీ వంటలక్క, డాక్టర్ బాబు వచ్చారు అంటూ సంబరపడిపోతున్నారు. ఇక మళ్ళీ మోనిత కార్తీక్ కోసం రావడం మళ్ళీ వంటలక్క కష్టాలు మొదలు. చూస్తున్న ప్రేక్షకులను ఎర్రోళ్లను చేసి ఏమి చెప్పినా చూస్తారని డైరెక్టర్ అనుకుంటున్నట్లున్నాడు. అయినా వ్యూస్ పరంగా రేటింగ్స్ బాగున్నపుడు అతనేం చేస్తాడు చూసే మనకు ఉండాలి కానీ… ఏది ఏమైనా పాపం వంటలక్కని ఈసారి మోనిత ఎన్ని కష్టాలు పెడుతుందో…



























