నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఎలా ఉన్నారో తెలుసా? అయన ఆరోగ్య రహస్యం…!!

0
328

తెలుగు చలన చిత్రసీమలో నవరస నటసార్వభౌముడుగా కొన్ని వందల సినిమాలలో నటించిన కైకాల సత్యనారాయణకు 85ఏళ్ళ వయసొచ్చినా ఇంకా హూషారుగా ఉండటమే కాకుండా తాను ఇప్పటికీ నటించడానికి రెడీ అని అంటున్నాడు. ప్రస్తుతానికి కొన్ని సినిమాలలో తాత పాత్ర పోషించమని ఆఫర్లు వస్తున్నా ఆపాత్ర నచ్చక అవకాశాలను వదులుకుంటున్నట్టు ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇంకా ఆ ఇంటర్వ్యూలో నేటి సినిమాల గురించి మాట్లాడుతూ ప్రజెంట్ ట్రెండింగ్ సినిమాలలో తనకు ఒక్క సినిమా కూడ నచ్చడంలేదనీ అందుకనే తాను ఆ సినిమాల గురించి మాట్లాడలేనంటూ.. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో తాను తనకి నచ్చిన పాత సినిమాలనే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని.. రోజుకు 2 సినిమాలు చూస్తున్నట్టు అని చెప్పారు. ఇంకా తనకు 85 సంవత్సరాలు వచ్చినా తన ఆరోగ్య రహస్యం మితాహారమేనని, ఉదయాన్నే చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వినడమంటే చాలా ఇష్టమని.. ఆ తరువాత యోగాసనాలు వేస్తానని.. ప్రతిరోజు తక్కువ మోతాదులో ఆల్కాహాల్ తీసుకుంటానని, అదికూడా డాక్టర్ సూచనల ప్రకారమే చేస్తున్నాని చెపుతూ తాను కూడ కరోనా భయంతో ఇంట్లోనే ఉన్నప్పటికీ రోజు చాలాసార్లు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటూ రోగనిరోధక శక్తి పెంచే పౌష్టికాహారం తీసుకుంటూవుంటానని..

తనను కలవడానికి ఎవరు రావద్దని తన బంధువులకు సన్నిహితులకు తానే స్వయంగా చెప్పానని తెలిపారు. అలాగే సీనియర్ నటులు గుమ్మడి, గిరిబాబు, సారధి లాంటి మిత్రులు తనకు అనేకమంది ఉండేవారని నేటి తరం నటీనటులతో తనకంతగా పరిచయాలు లేవని తెలిపారు మన నవరస నటసార్వభౌముడు. చదివారుగా కైకాల గారి ఆరోగ్య రహస్యాలు.. మరి మీకూ నచ్చితే మీరు పాటించి లైఫ్ ని ఎంజాయ్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here