Kajal Agarwal : కాజల్ తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని భామ. టాలీవుడ్ చందమామగా కొన్నేళ్లు నెంబర్ వన్ గా తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన కాజల్ అగర్వాల్ ఇంకా కెరీర్ బాగానే ఉన్నా పెళ్లి చేసుకుని అబ్బాయిలందరినీ బాధపెట్టేసింది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు తో పెళ్లి, ఆ తరువాత అమ్మైన కాజల్ గురించి అప్పట్లో వినిపించిన ఒక ఇంట్రెస్టింగ్ గాస్సిప్ మళ్ళీ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాజల్ అగర్వాల్ ఆ హీరోతో ప్రేమలో ఉంది ఈ హీరోతో ప్రేమలో ఉంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఒక రూమర్ మాత్రం నిజమేమో అనేలా అప్పట్లో వినిపించింది.

బన్నీ తో లవ్ స్టోరీ…
ఆర్య సినిమాలో అల్లుఅర్జున్ సరసన నటించింది కాజల్ ఆ సినిమాలో పరిచయం కాస్తా ప్రేమగా మారిందట. ఇద్దరూ ప్రేమించుకోవడం సహజీవనం చేయడం కూడా జరిగాయాట. ఇద్దరూ సీరియస్ గా ప్రేమించుకుని పెళ్లి చెసుకోవాలని అనుకుంటే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అడ్డుపుల్ల వేశారట. ఒక హీరోయిన్ వాళ్ళ ఇంటి కోడలిగా రావడం ఇష్టం లేని ఆయన వాళ్లిదరి ప్రేమను అంగీకరించలేదట. ఇక చేసిదేమి లేక అల్లు అర్జున్, కాజల్ తో బ్రేక్ అప్ అయ్యాడనేది ఆ గాసిప్ సారాంశం.

ఇక కొద్దిరోజుల తరువాత బన్నీ తన స్నేహితురాలైన స్నేహ రెడ్డి ని మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ఇక కాజల్ బన్నీ బ్రేక్ అప్ అయ్యారని వినిపించిన సమయంలోనే కాజల్ మీడియాతో మాట్లాడిన మాటలు కొంచెం కాంట్రవర్సి అయ్యాయి. ఎవరినైనా ప్రేమిస్తున్నారా అనే ప్రశ్నకు జవాబిస్తూ కాజల్ ఇండస్ట్రీలో నేను ఎవరితోనూ చనువుగా లేను, నా ఎథిక్స్ దాటి ప్రవర్తించలేదు. నిజాయితీగా ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఈ స్థాయిలో ఉండటం పూర్తిగా నా కష్టార్జితం అంటూ మాట్లాడింది. ఇక అప్పట్లో కాజల్ మాటలకు చాలా మంది ట్రోల్స్ కూడా చేసారు. కానీ ఈ ఎపిసోడ్ లో ఎంత నిజముందో మాత్రం ఎవరికీ తెలియదు.


































