వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకుని గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకుంది. ఇలా వివాహం తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. వివాహం తరువాత కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అదేవిధంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఘోస్ట్ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ లో దాదాపు వారం రోజుల పాటు పాల్గొన్న కాజల్ అగర్వాల్ అనూహ్యంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే కాజల్ అగర్వాల్ ఇలా సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం ఆమె తల్లి కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా తన గురించి వార్తలు వస్తున్నప్పటికీ కాజల్ అగర్వాల్ ఈ విషయంపై మాత్రం స్పందించలేదు. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడైనా కాజల్ అగర్వాల్ తన ప్రెగ్నెన్సీ విషయం గురించి బయట పెడతారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.





























