కొద్ది రోజుల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత పది రోజుల పాటు హనీమూన్ ట్రిప్ లో భాగంగా మాల్దీవులలో సందడి చేసిన విషయం మనకు తెలిసినది. అయితే వీరి హనీమూన్ ట్రిప్ ను ముగించుకున్న తర్వాత కాజల్ అగర్వాల్ ఇండియాకు వచ్చి తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే చిరంజీవితో కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె తన భర్తతో కలిసి “ఆచార్య” సెట్ కు వచ్చారు.

కాజల్ అగర్వాల్ చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ మంగళవారం ఆచార్య సెట్ కి తన భర్తతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా కథానాయకుడు చిరంజీవి, ఆచార్య చిత్ర బృందం నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవి సమక్షంలో ఒకరికొకరు దండలు మార్చుకొని ,కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నూతన దంపతులిద్దరిని చిరంజీవి ఆశీర్వదించారు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం సాగింది.అయితే కొద్ది సమయం మాత్రమే కాకుండా సినిమా మొత్తం తన తండ్రితో పాటు కలిసి నటిస్తున్నా రని సమాచారం. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే తెరపై కనిపించబోతున్నారని తెలియడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వచ్చే నెల నుంచి రామ్ చరణ్ ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here