తొలి చిత్రం ‘లక్ష్మీకళ్యాణం’ తో అందరిని ఆకట్టుకున్న కాజల్ ‘చందమామ’తో హిట్ కొట్టి తనలోని టాలెంట్ నిరూపించుకుంది. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. ముంబైలోనే మాస్ మీడియాలో డిగ్రీ చేసిన కాజల్ ‘క్యూ హో గయా నా’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్నుంచి సినిమాలపై మక్కువ పెంచుకొన్న ఆమె దక్షిణాదివైపు దృష్టిపెట్టి రాణించింది.
కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమా తో పాటు మంచు విష్ణు మోసగాళ్లు చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే నాగార్జున సరసన కూడా ఓ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.. ఇక కాజల్ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసి ఫోటోలు యూత్ ని మత్తెక్కిస్థాయి.. ఇక కాజల్ కి ఇటీవలే పెళ్లయిన విషయం తెలిసిందే. ఆమె ఎంత స్టార్ హీరోయిన్ అయినా వారికి ఉండే సమస్యలు వాళ్లకు ఉంటాయి. అలాంటి ఓ సమస్యను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కొత్త ప్రాజెక్ట్స్ సంబంధించిన డిటైల్స్ వివరించారు. కింగ్ నాగార్జునతో ఓ మూవీ చేస్తున్నట్లు కాజల్ చెప్పడం విశేషం.
ఈ మధ్య విడుదలైన వెబ్ సిరీస్ లైవ్ టెలీకాస్ట్ లో కాజల్ భిన్నమైన రోల్ చేశారు. సిగరెట్, ఆల్కహాల్ తాగుతూ అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపించారు.ఈ సిరీస్ కి మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పిన కాజల్, మరో వెబ్ సిరీస్ చేయనున్నట్లు చెప్పడం విశేషం.కాగా కాజల్ చిన్నప్పటి నుండి తనను వేధిస్తున్న ఓ సమస్యను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రతి ఉదయం నిద్ర లేవడం తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఎరుపెక్కిన నిద్ర కళ్ళతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటారట.నిద్ర మత్తునుండి తేరుకొని బెడ్ దిగే ఆ ఐదు నిముషాలు తనకు నరకం కనిపిస్తుందని కాజల్ తెలియజేశారు. స్కూల్ కి వెళ్లే ఏజ్ లో రెడీ చేయడానికి వాళ్ళ అమ్మ నిద్ర లేపేవారట.. అప్పుడు ఆ బాధ దారుణం అంటున్నారు ఆమె.నిజానికి కాజల్ అనుభవించే ఈ సమస్య అందరికీ ఉండేదే… పేరెంట్స్ నిద్ర లేపుతుంటే ఇంకొంచెం సేపు పడుకోవాలని అనిపించడం సర్వసాధారణం.

































