Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు. సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ, విలనిజం రెండింటినీ పండించిన ఆయన బి.ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఎన్టీఆర్ ఒకరోజు పని ఇచ్చి ఎంత డబ్బు ఇచ్చాడంటే…
అగ్ర నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్ వంటి వారితో ఎక్కువ సినిమాల్లో నటించిన కాకరాల గారు ఆయన అభిమాన నటుడు అనగా ఎస్విఆర్ అంటూ తెలిపారు. ఇక ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం గురించి తెలుపుతూ 1976 లో వచ్చిన ‘వేములవాడ భీమ కవి’ సినిమాలో భీమ కవి పాత్రలో నటించిన బాలకృష్ణ కు గురువుగా కాకరాల గారు నటించారు. అయితే ఆ పాత్రకు ఆయనే నటించాలని కొరింది స్వయానా ఎన్టీఆర్ గారే.

ఎన్టీఆర్ గారే స్వయంగా వచ్చి కాకరాల గారిని నటించమని అడిగితే అదే సమయంలో నాటకం ఉందని చెప్పగా అయితే మా సినిమా షెడ్యూల్ లోనే మార్పు చేస్తాం అలా అయితే చేస్తారా అని అడిగారట. అలా అడిగాక ఇంక అభ్యంతరం ఏముంటుందని కాకరాల గారు చేసారట. ఒకరోజు గంట షూటింగ్ చేసిన తరువాత 300 వందల రూపాయలు చేతిలో పెట్టి ఎన్టీఆర్ గారు పంపారట.































