Kakarala Sathyanarayana : నాటకాలు రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు. సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ, విలనిజం రెండింటినీ పండించిన ఆయన బి.ఎన్ రెడ్డి గారి ‘రంగుల రాట్నం’ సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ‘మా భూమి’ వంటి సినిమాలో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూని, వంకర ఉన్న కృష్ణ ను నటుడిని చేసింది ఆయనే…
కృష్ణ గారి నటన ‘సాక్షి’ సినిమాలోనూ ‘దేవదాసు’ సినిమా సమయానికి పోల్చుకుంటే అందులో ఎంతో పరిణితి కనిపిస్తుందంటూ కాకరల సత్యనారాయణ గారు అభిప్రాయపడ్డారు. దేవదాసు సినిమా సమయానికి కృష్ణ కు సన్నిహితంగా ఉండే గోపాల రావు గారు రాజారావు గారి దగ్గరికి వచ్చి నటనలో శిక్షణ ఇప్పించాలని కోరగా గూని, వంకర గా ఉన్న అతడికి నేనేం నేర్పించాలని రాజారావు గారు అన్నారట. అయితే చివరికి ఒప్పుకుని మెలకువలను నేర్పించారట

అలానే మేకప్ మెన్ గా మాధవరావు ను పెట్టి కృష్ణ లో గొప్ప మార్పును తెచ్చారట. ఇక ‘అల్లూరి సీతారామరాజు’ చేసే సమయానికి రాజారావు గారు మెలకువలు నేర్పిస్తూ అలానే నాటకంలో మొదట నటింపజేశారట కృష్ణ గారిని. అల్లూరి సీతారామ రాజు నాటకం సమయంలో కాకరల గారు కృష్ణ గారికి ఎండింగ్ లో వచ్చే డైలాగులన్ని ప్రాంప్టింగ్ చెప్పేవారట. అలా కృష్ణ గారి నటనలో మెరుగులు దిద్ది ఆయనను సూపర్ స్టార్ ను చేసారని అయితే ఈ విషయాలు బయట పెద్దగా తెలియవంటూ కాకరల పంచుకున్నారు.

































