Kakinada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామల గా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఎలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండి తెర బుల్లి తెరకు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు ఇండస్ట్రీ గురించి వివరించారు.

ఎన్టీఆర్ లక్ష్మి పార్వతికి పడిపోవడం ఏమిటి…
కాకినాడ శ్యామల ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అంటూ చెప్పారు. ఆయన నటించిన పాత్రలు ఇంకెవరూ చేయలేరు అంటూ చెప్పారు. అయితే సినిమాలలో ఎన్నో మహోన్నతమైన పాత్రలను వేసిన ఆయన లక్ష్మి పార్వతికి పడిపోయి జీవితంలో పెద్ధ తప్పు చేసారు. ఆడవాళ్ళ వీక్నెస్ వల్లే లక్ష్మి పార్వతికి పడిపోయాడు. ఒక రైటర్ గా వచ్చిన లక్ష్మి పార్వతి ఆయన మనిషి అయింది చివరకు అంటూ చెప్పారు.

ఇక తమిళ దర్శకుడు బాలచంధర్ గారికి కూడా ఆడవాళ్ళ వీక్నెస్ ఉందంటూ చెప్పారు. గీత, సరిత వంటి హీరోయిన్స్ తో ఎక్కువగా ఉండేవారని. అయితే ఆయన గొప్ప దర్శకుడంటూ శ్యామల అభిప్రాయపడ్డారు. మారొచరిత్ర వంటి అద్భుతం ఆయన మాత్రమే తీయగలడు అంటూ మాట్లాడారు శ్యామాల. ఇండస్ట్రీలో ఇలా ఆడవాళ్ళ వీక్నెస్ ఉండేవాళ్లు చాలా మందే ఉంటారని చెప్పారు.



























