Kalyan Ram : సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న సమయంలో బింబిసార, సీతా రామం సినిమాలు ఇండస్ట్రీ కి కొత్త నమ్మకాన్ని ఇచ్చాయి. బావబేధాలు లేకుండా ఇండస్ట్రీ నుండి ప్రతి ఒక్క హీరో సినిమాను చూడమని ప్రోత్సహిస్తున్నారు. అలా మొదటి ఆట నుండి హిట్ టాక్ అందుకుని మంచి వసూళ్లతో దూసుకుపోతున్న బింబిసార డైరెక్టర్ వశిష్ట, హీరో కళ్యాణ్ రామ్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్. ఇక ఆ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను మాట్లాడుకున్న ముగ్గురు, రెండో భాగం కథ గురించి లీక్ ఇచ్చేసారు.

బింబిసార ఎలా మొదలయ్యాడో రెండవ భాగం…
సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో విలనిజం చాలా బాగా చూపించాడు కళ్యాణ్ రామ్. ఇక ఇదే విషయాన్ని వినాయక్ కూడా చెప్పారు. చాలా చక్కగా విలనిజం చూపించారు. రెండో పార్ట్ తీసే ఆలోచన ఉంటే అందులో కూడా విలనిజాన్ని కొంసాగించండి అంటూ సూచించారు. ఇక ఈ విషయం గురించి స్పందిస్తూ కళ్యాణ్ రామ్ బింబిసార రెండో పార్ట్ గురించి మాట్లాడుతూ కథ ఆల్రెడీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక రెండో భాగంలో అసలు బింబిసారుడు ఎందుకు అలా అయ్యాడు, తమ్ముడు దేవదత్తుడినే చంపాలని ఎందుకు అనుకున్నాడు, అన్ని రాజ్యలను ఎలా గెలిచాడు అనేదే రెండో భాగం ఉంటుందని లీక్ ఇచ్చేసాడు కళ్యాణ్ రామ్.

ఇక డైరెక్టర్ వశిష్ట కూడా రెండో భాగం ఎలా ఉండబోతోందో చెప్పేసాడు. ఇక వినాయక్ హిందీ లో విడుదక చేయాలని అనుకోవడం లేదా సినిమాని అని అడుగగా ఇంకా ఏమి అనుకోలేదు తెలుగులో వస్తున్న స్పందన చూసాక నిర్మాత హరి కృష్ణ తో మాట్లాడాలి, హిందీ లో డబ్ చేసి విడుదల చేయడం గురించి ఆ పనుల్లో హరికృష్ణ ఉన్నాడనుకుంటా అని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఇక డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ హిందీ లో ఇంకా మంచి స్పందన సినిమాకు వస్తుందని అనుకుంటున్నా. నెట్టింట్లో బింబసార గురించి ఎక్కువ వెతికింది ఉత్తరాది వాళ్లే కాబట్టి వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది అనే నమ్మకం ఉంది అంటూ చెప్పారు.



























