Kalyan Ram : నందమూరి వారసులుగా హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. మొదట తారక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ మనవడిగా నిరూపించుకున్నాడు. నటనలో డైలాగ్ చెప్పడంలో డాన్స్ లో తనకు తానే సాటి అనేట్టుగా తారక్ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ తమ్ముడి కంటే లేట్ గా సినిమాల్లోకి వచ్చిన అతనోక్కడే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అటు నందమూరి ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సినిమాలు చేస్తూనే ఇటు అభిరుచి కి తగ్గట్టు కథకు ప్రాధన్యమున్న సినిమాలను తీసాడు. అయితే తారక్ టాప్ హీరోలలో ఒకడిగా కష్టపడి చేరుకున్న కళ్యాణ్ రామ్ ఇంకా కెరీర్ లో సెటిల్ అవ్వలేదు.
లైవ్ లో తారక్ ఫోన్…

చాలా రోజుల తరువాత కళ్యాణ్ రామ్ ఒక డిఫరెంట్ కథతో పౌరాణిక కథను మోడరన్ కథను జతచేసి బింబిసార గా వస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద వస్తోన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్ వ్లోజ్ విత్ ఎన్కేఆర్ అనే లైవ్ కార్యక్రమం నిర్వహించాడు కళ్యాణ్ రామ్. ఇక సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా మీద కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
సినిమా గురించి మాట్లాడే ముందు తాను బాల్యంలో నటించిన చిత్రాలు, వైఫల్యం చెందిన సినిమాల గురించి, కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితులు, ఇక బాబాయ్, తమ్ముడు నటించిన అఖండ, ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో తారక్ నుండి ఫోన్ వచ్చింది. దీంతో నూరేళ్లు తారక్ కు తారక్ గురించి మాట్లాడుతుంటే కాల్ వచ్చింది అంటూ లైవ్ మధ్యలో వెళ్ళిపోయాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ సంఘటనతో అన్నదమ్ముల మధ్య ఎంత చక్కటి అనుబంధం ఉంది అంటూ నెటిజన్స్ ప్రశంశిస్తున్నారు.






























