ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సుమ ఆడపడుచు, రాజీవ్ కనకాల చెల్లెలు అయిన శ్రీలక్ష్మి అనారోగ్యంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు ఎందరో నటులకు ఓనమాలు నేర్పించిన దేవదాస్ కనకాల గారి ఏకైక కుమార్తె. ఆమె మరణంతో ఇప్పుడు సుమ ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీలక్ష్మి భర్త ప్రముఖ జర్నలిస్టు. పెద్ద రామారావు గారు.

వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అడపాదడపా కొన్ని సీరియల్స్ లో నటించిన శ్రీలక్ష్మి నటిగా పెద్దగా రాణించలేకపోయారు. కొద్దిరోజుల క్రితమే దేవదాస్ కనకాల శ్రీమతి లక్ష్మి, అనంతరం దేవదాస్ కనకాల ఇప్పుడు శ్రీలక్ష్మి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇలా రెండు మూడేళ్ళుగా ఆ కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రాజీవ్ కనకాల ఈ ఈ మరణాలతో ఎక్కువగా కుంగిపోయారని అంటున్నారు. శ్రీలక్ష్మి మరణ వార్త వినగానే పలువురు సినీ మరియు టీవీ ప్రముఖులు రాజీవ్ కనకాల ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు.




























