Kangana Ranaut: ఈ మధ్య సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఇక బాలీవుడ్ సినిమాలు ఓటీటీ లో విడుదల చేసుకుంటే మంచిదని రామ గోపాల్ వర్మ వంటి వారు చురకలేస్తున్నా, మరో వైపు బాలీవుడ్ లో సినిమాలు చేయాల్సిన అవసరం లేదంటూ మహేష్ లాంటి స్టార్ హీరో కామెంట్స్ చేయడంతో బాలీవుడ్ జనాలు తలలు పట్టుకుంటున్నారు.

ఇక ఎప్పటికప్పుడు బాలీవుడ్ నేపోటిజం గురించి చురకలు అంటించే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇక సౌత్ సినిమాలను తెగ పొగిడేస్తూ బాలీవుడ్ సినిమాలను ఎప్పటికప్పుడు ఏకిపారేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలను పొగిడేసిన కంగనా ఇపుడు పుష్ప సినిమాను బన్నీని తెగపొగిడేసింది.
బాలీవుడ్ హీరోలు ఇలాంటి కూలీ పాత్ర చేయలేరు….

ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడని ప్రేక్షకులు తమని తాము ఆ పాత్రలో చూసుకున్నారని కూలీ లాంటి పాత్రను బాలీవుడ్ స్టార్ కిడ్స్ చేయరని ఇక వారు చేసే పాత్రలు జనాలకు నచ్చడం లేదని అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ కావడం లేదని చెప్పింది. ఇక అల్లు అర్జున్ భాషా హావభావాలు అన్ని ప్రేక్షకులను బన్నీని ఓన్ చేసుకునేలా చేశాయని అందుకే సినిమా అన్ని భాషలలోనూ హిట్ అయిందని చెబుతూ బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఇలా చేయలేరని వాలు బాయిల్డ్ ఎగ్స్ అంటూ హేళన చేసారు. ఇపుడు ఈ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ లో ఉన్నారు.




























