Kantamaneni Uma Maheswari : ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె అయిన కంఠమనేని ఉమా మహేశ్వరి సోమవారం అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఆకస్మిక మరణం నందమూరి కుటుంబం లో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం మధ్యాహ్నం ఆమె స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉమా మహేశ్వరి పార్థివదేహానికి పోస్టుమార్టం కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశారు.

గతంలో తన కళ్ళను దానం చేయాలని కోరిన ఉమా మహేశ్వరి…
నిన్న కన్నుమూసిన ఉమా మహేశ్వరి పార్థివదేహానికి పోస్టుమార్టం ముగిసాయి. అయితే ఈ క్రమంలోనే ఆమె కళ్ళను దానం చేశారు. గతంలో తాను చనిపోయిన తరువాత తన కళ్ళను దానం చేయాలని ఉమా మహేశ్వరి కుటుంబసభ్యులను కోరారట. అందుకే ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కళ్ళను దానం చేశారు.

ఇక ఉమా మహేశ్వరి కూతురు అమెరికా నుండి రావాల్సి ఉండగా, ఆమెరావడం ఆలస్యం అవుతుందన్న కారణంగా వైద్యులు భౌతిక దేహానికి ఎంబామింగ్ పక్రియను కూడా నిర్వహించారు. ఇకపోతే పోస్టుమార్టం రిపోర్టులకు మాత్రం మరో రెండురోజుల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.
































