Kantharao Daughter Susila : తెలంగాణ మొదటి సూపర్ స్టార్ అంటే కత్తుల కాంతారావు గారే. ఎన్టీఆర్ తో పాటు ఆ కాలంలో పౌరాణిక సినిమాల్లో నటుడుగా రాణించిన ఆయన అటు పౌరాణిక జానపదాలతో పాటు సాంఘిక చిత్రలలో కూడా అలరించారు. ఇక ఎన్నో సినిమాల్లో హీరోగాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసిన ఆయన విలన్ గా కూడా ప్రయత్నించారు. ఇక ఆయన నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్న ఆయన ఆస్తిత్వాన్ని నిలుపుకోవాలని వాళ్ళ పిల్లలు ఆరాట పడుతున్నారు. ఇక అంత పెద్ద హీరో అయినా సినిమాలో సంపాదించిన ఆస్తి అంతా అందులోనే పోగొట్టుకున్న ఆయన చివరగా సొంతిల్లు లేకుండా మరణించారు. ఇక ఆయన జీవిత విశేషలను ఆయన కూతురు సుశీల తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఎన్టీఆర్ గారి సలహాలు పట్టించుకోలేదు… కృష్ణగారు సహాయం చేశారు…
ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన ఆర్ధికంగా నష్టపోవటానికి ప్రధాన కారణం సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సినిమాలను తీసి అవి నష్టాలను తేవడం వల్ల ఆస్తులన్నీ కరిగిపోయాయి.

ఈ విషయంలో కాంతారావు గారికి ఎన్టీఆర్ గారు ప్రొడక్షన్ లోకి రాకండి లోతుపాతులు చాలా ఉంటాయి అనవసరంగా నష్టాలను చూస్తారు అని చెప్పినా కాంతరావు గారు వినలేదట. ఇక ఆస్తులన్నీ పోగొట్టుకున్నాక నా పెళ్లి విషయంలో కృష్ణ గారు సహాయం చేసారని, పదివేలు పంపారని సుశీల గారు చెప్పారు. ఇక విజయనిర్మల గారు మా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాలో మీకు వేషం ఇస్తామని చెప్పి చాలా సినిమాల్లో అవకాశాలు ఇచ్చారంటూ సుశీల గారు చెప్పారు.































