Kantharao Daughter Susila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన నాటకాల్లో ప్రసిద్ది చెంది ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అలాగే విలన్ గానూ నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన గురించి కుటుంబ విషయాలను కూతురు సుశీల రావు పంచుకున్నారు.

మా నాన్న ను గుర్తించండి…
సుశీలగారు తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి ఇద్దరు పెద్ద నటుల మధ్య నిలదొక్కుకున్న వ్యక్తి మా నాన్న. అప్పట్లో హీరోలంటే ముగ్గురే రామారావు, నాగేశ్వరావు, కాంతారావు కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వాళ్ళను తలుచుకుంటారు కానీ మా నాన్నను ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కాంతారావు గారి గురించి తెలుసుకోవాలి అని మా అభిప్రాయం. ఆయన బ్రతికిన్నపుడే ఇల్లు ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఆయన పోయాక మాకు ఇస్తారని అనుకోవడం లేదు.

కానీ ఆయన స్మరకంగా ఒక విగ్రహం అయినా నాన్న సొంత్తూర్లో అయినాకనీసం పెడితే బాగుంటుంది. మొదటి తెలంగాణ సూపర్ స్టార్ ఆయన అలాంటిది ఆయనను మరిచిపోతే ఎలా అంటూ మాట్లాడారు. ఇక సుశీల గారు మాట్లాడుతూ నాన్నకు సినిమా తప్ప ఏమీ తెలియదు, చనిపోయేవరకు సినిమాల్లోనే నటిస్తాను అనే వారు. మేము బ్రాహ్మణులం మాకు వ్యాపారం చేయడం పెద్దగా తెలియదు అందుకే ఆయన మరెక్కడా పెట్టుబడి పెట్టలేదు, కేవలం సినిమానే నమ్ముకున్నారు అంటూ ఆయన మంచి సినిమాలను చేసినా ఆయనను ఎవరూ గుర్తుచేసుకోరు, ఇప్పుడు అదే బాధగా ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యారు సుశీల గారు.
































