వకీల్ సాబ్ : ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు.. మూడో పాట..

0
74

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు రిలేజై ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా తో యూనిట్ మరో అప్డేట్ తీసుకొచ్చింది.

ఈనెల 17న సాయంత్రం 5 గంటలకు “కంటిపాప” అంటూ సాగే మూడో పాటను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమాపై అటు పవన్ అభిమానుల్లో మరియు తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. అందుకనుగుణంగానే ఇదివరకు విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరి రేపు రాబోయే “కంటిపాప” అనే పాట ఇంకెన్ని మిలియన్స్ వ్యూస్ రాబడుతుందో చూడాలి. కాగా, ఏప్రిల్ 9 న విడుదలకు సిద్దమవుతుంది “వకీల్ సాబ్” చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here