Karate Kalyani : యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య వివాదం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ వివాదం ముదిరి ఇరువురూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. తనపై దాడి చేసిన శ్రీకాత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే ఇద్దరి పై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సి ఐ సపోర్ట్ చేస్తున్నారని ఎస్‌ఆర్ నగర్ సీఐ సైదులుపై కరాటే కల్యాణి మండిపడింది. తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా కరాటే కల్యాణి సీఐపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. వీరి మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

ఈ గొడవ జరుతుండగానే ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా కరాటే కళ్యాణి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు కంప్లైంట్ ఇవ్వడం, ఇక ఇపుడు తాజాగా కరాటే కళ్యాణి పెంపుడు పిల్లల గురించి పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా పిల్లలను దత్తత తీసుకొని ఇంట్లో పెట్టుకుంది అని ఒక అజ్ఞాత వ్యక్తి 1098 నెంబర్ కి ఫిర్యాదు చేసాడు. దీంతో ఈ వివాదం లో మరోకోణం వెళగులోకి వచ్చింది.
24 గంటలు గడిచినా ఇంకా తన కూతురు ఇల్లు చేరలేదని కరాటే తల్లి ఆవేదన…..

అయితే గుర్తు తెలియని వ్యక్తుల ఫిర్యాదు మేరకు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కళ్యాణి నివాసం అయిన యర్రగడ్డలోని రాజీవ్ కాలనీ లో శ్రీ లక్ష్మి నిలయం అపార్ట్మెంటులో సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో కరాటే కళ్యాణి తల్లి మాత్రమే ఇంట్లో వున్నారు. ఈ క్రమంలో కరాటే కళ్యాణి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. కళ్యాణి తాను పెంచుకున్న కూతుర్ని తీసుకుని నిన్న బయటకు వెళ్లిందని, ఇంతవరకు ఇల్లు చేరలేదని తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండటంతో ఆందోళనగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కారణంగా తన కూతురికి ప్రాణహాని ఉందని మీడియకు తెలియజేసింది. తన కూతురు ప్రభుత్వ అనుమతి తోనే పిల్లలను దత్తత తీసుకుందని, కావాలనే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పింది. కళ్యాణి నోరు విప్పితే ఇందులో నిజానిజాలు తెలుస్తాయి.































