Karate Kalyani : తెలుగు కమెడియన్ గా వాంప్ తరహా పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందిన నటి కరాటే కళ్యాణి. ముఖ్యంగా తనకు ఒక సినిమాలో ‘బాబీ…’ అనే డైలాగుతో బాగా ఫేమస్. ఇక సినిమాల్లో నటించడమే కాకుండా అప్పుడప్పుడు బయట వివాదాలతో కూడా బాగా ఫేమస్ అయింద కళ్యాణి. ప్రస్తుతం బీజేపీ లో ఉంటూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరడుతోంది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రైవేట్ ఆల్బమ్ లో బికినీ వేసుకుని ‘హరే రామ హరే కృష్ణ’ పదాలను వాడటం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. ఇక తన వ్యక్తిగత విషయాలను చాలా మంది తనను నెగెటివ్ గా కామెంట్స్ చేయడం గురించి ఇంటర్వ్యూలో కళ్యాణి ఎమోషనల్ అయ్యారు.

నా భర్త నడి రోడ్డు మీద అలా చేసాడు…
కళ్యాణి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తనకు పెళ్లి కలిసిరాలేదని, భర్త బాగా హింసించాడు అంటూ తెలిపారు. భర్త తాగి కోట్టడం వేదించడం చేసేవాడని, తాగుడుకు బానిసైన భర్త రాత్రి బాగా తాగి రెండు గంటలకు అలా వచ్చినా వండిపెట్టిన రోజులు ఉన్నాయని, భార్యగా నా బాధ్యత కరెక్ట్ గా ఉన్నా కూడా తాను హింసించాడంటూ తెలిపారు. ఒకరోజు అర్ధరాత్రి రోడ్డు మీద తాగి నడి రోడ్డులో పైట లాగి చెండాలంగా ప్రవర్తించాడు, ద్రౌపది వస్త్రాపహరణం లాంటిదే జరిగేది అని తెలిపారు.

కరాటే లో బ్లాక్ బెల్ట్ అయినా కూడా నా భర్తను కొట్టాలని అనుకోలేదు, చాలా భరించాను ఇక నావల్ల కాదని విడాకులు ఇచ్చేసాను అంటూ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత దారుణమైన పరిస్థితులను తెలిపారు. ఒంటరిగా ఉండాలంటే ఇప్పటికీ భయం అందుకే అమ్మతోనే ఉంటాను అంటూ నెగెటివ్ కామెంట్స్ వల్ల చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. కానీ ఇపుడు పోరాడటం నేర్చుకున్నాను, నా మీద ఎన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా వారికి సమాధానం ఎలా చెప్పాలో అలా చెప్పేదాన్ని అంటూ భవిష్యత్ లో నచ్చినవాడు కనిపిస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటూ కళ్యాణి తన మనసులోని మాట తెలిపారు.

































