అతడు ఓ బాలికను అత్యాచారం చేశాడు. ఆ కేసుపై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి.. ఎవరినైతే అత్యాచారం చేశాడో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఒక బిడ్డ కూడా పుట్టింది. ప్రస్తుతం తాము భార్యభర్తలం అని.. తనపై ఉన్న కేసును కొట్టేయాలని అతడు పిటిషన్ పెట్టుకున్నాడు.

విచారణ అనంతరం పెళ్లి చేసుకున్నంత మాత్రానా అత్యాచార కేసు కొట్టేయాల్నా.. అలాంటి రూల్ ఏమి లేదు అని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అతడు షాక్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకాకు చెందిన అనీల్ .. ఓ రోజు అదే గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేశాడు.
తర్వా త ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వాళ్ల తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద అరెస్టు చేశారు. కొన్నాళ్లకు బెయిల్ నుంచి విడుదలైన అనీల్ .. బాధిత మహిళను తల్లిదండ్రుల ఒప్పందంతో వివాహం చేసుకున్నాడు. తర్వాత వాళ్లకు ఒక బిడ్డ కూడా పుట్టింది.
ఓ రోజు అతడు జరిగిన విషయాన్ని చెప్పి.. తనపై ఉన్న కేసును కొట్టేయాలని పిటిషన్ పెట్టుకున్నాడు. విచారణ కలబురిగి బెంచ్‌కు వచ్చింది. పెళ్లి చేసుకున్నంత మాత్రానా కేసు కొట్టేయాల్నా.. అలాంటి రూల్ ఎక్కడా లేదు.. బాలికపై అత్యాచారానికి పాల్పడి, తరువాత పెళ్లి చేసుకున్నా శిక్ష నుంచి తప్పించుకోలేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును జస్టీస్ హెచ్‌పీ సందేశ్ ఇచ్చాడు. ఈ కోర్టు తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది.































