ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్తర్ చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఈ చిత్రం టాలీవుడ్ లో ఎన్ని రికార్డ్స్ తిరగరాసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో పాటలు మరో ఎత్తు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా కంటే ముందు పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.

మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ సాంగ్’ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది. చిన్నా పెద్ద నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాటకు డాన్స్ చేసారు. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా చేరిపోయాడు. అయితే బన్నీ వేసిన స్టెప్స్ కాదులెండి. కార్తీక్ ఆర్యన్ మరో కొత్త స్టెప్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ డాన్సింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.



























