సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమైపోయింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే లైంగిక దోపిడీ జరుగుతుందనే అంశం సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మహిళలపై జరిగే దాడులు అరాచకాలు గురించి ఎంతో మంది నటీనటులు వారికి ఎదురైన అనుభవాలను గురించి ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే ఇదివరకు క్యాస్టింగ్ కౌచ్ వెండి తెరపై మాత్రమే ఉండేది. కానీ బుల్లితెర నటీమణుల పై కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని తాజాగా కార్తీకదీపం నటి ప్రియమణి తన బాధను తెలియజేశారు.

కార్తీకదీపం సీరియల్ లో మౌనిత దగ్గర పనిమనిషి పాత్రలో చేస్తున్న ప్రియమని తాజా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ లో భాగంగా తన కెరియర్ సంగతులతో పాటు కాస్టింగ్ కౌచ్ అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ కమిట్మెంట్స్ అనేవి ఇండస్ట్రీలో ఉన్నాయని అలాంటివి తాను కూడా అనుభవించానని తెలియజేశారు.తనకి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి అమ్మాయికి ఇలాంటి సందర్భాలు ఎక్కడో ఒకచోట ఎదురవుతాయని ఈమె తెలియజేశారు.
మన పై జరిగే ఈ కాస్టింగ్ కౌచ్ కి అంగీకారం తెలపాల వద్దా అనేది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలు పై ఆధారపడి ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ అంటే కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి రంగంలోనూ ఉంది ఎక్కడైతే అమ్మాయిలు పనిచేస్తుంటారో తప్పకుండా ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా ప్రియమణి తెలిపారు.
ఈ విధమైన లైంగిక దోపిడీ విషయంలో వార్నింగ్ ఇవ్వడం వంటివి చేస్తే వారి జీవితం అక్కడికే ముగిసిపోతుందని కామెంట్ చేయగా ఈమె వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.నా విషయంలో కూడా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఎలాంటి వార్నింగ్ లేకుండా నవ్వుతూ అక్కడి నుంచి బయటకు వచ్చానని తెలియజేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో పని మనిషి ఇ పాత్రలో నటిస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.





























