బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ తెలియని వారు ఎవరుంటారు… చిన్నపిల్లాడు కూడా కార్తీకదీపం సీరియల్స్ గురించి చెబుతారు. ఇక ఇంట్లో ఆడవారు అత్యంత ఇష్టపడే సీరియల్ “కార్తీకదీపం” మాటీవీ లో ప్రసారమయ్యే సీరియళ్లలో ఇదే ప్రధానమైనది. రేటింగ్స్ పరంగా కూడా ఈ సీరియల్ మాటీవీ కి భారీ టీఆర్పీ రేటింగ్స్ తెచ్చిపెడుతుంది. దీని తరువాత టిఆర్పి రేటింగ్స్ ఎక్కువగా వచ్చేది జబర్దస్త్ షోకి మాత్రమే. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్డస్ట్ కామిడి షో ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్నిటికంటే ఎక్కువగా టిఆర్పి రేటింగ్స్ తెచ్చేది ఇదే…

అయితే తాజాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని క్లోజ్ అవడంతో అందరు ఇంటికే పరిమితమయ్యారు. అందువల్ల షూటింగ్స్ లేకపోవడంతో కొత్త ఎపిసోడ్స్ ప్రసారం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రోగ్రామ్స్ కు టీఆర్పీ రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. లాక్ డౌన్ కు ముందు ఈ రెండు షో లకు అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ షోలు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ కు పెద్దగా టీఆర్పీ రేటింగ్స్ రావడంలేదు.

ప్రస్తుతం టీవీలో వస్తున్న వార్తలు, అతి కొద్దీ సినిమాలుకు టీఆర్పీ రేటింగ్స్ పెరిగింది. అదే సమయంలో సీరియల్స్, రియాలిటీ షో లకు సంబంధించిన షూటింగ్స్ లేకపోవడంతో ఆ రెండు ఛానెల్స్ పాత ఎపిసోడ్స్ ను రిపీట్ చేస్తున్నారు. దీనితో వీరికి టీఆర్పీ రేటింగ్స్ భారీగా పడిపోయాయి. ఎప్పుడు మొదటి రెండు స్థానాలలో ఉండే ఈ రెండు కార్యక్రమాలు కిందికి దిగడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో కార్తీకదీపం 3 వ స్థానం, జబర్దస్త్ 5 వ స్థానానలకు పడిపోయాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత షూటింగ్స్ కి అనుమతిస్తే మళ్ళీ పూర్వవైభంవం అందుకునే అవకాశాలు ఉన్నాయి.
































