చేసిన అతికొద్ది సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అతని సినిమాలతోనే కాదు ఎప్పుడు ఎదో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో ముందుకు వస్తుంటారు ఈ రౌడీ.. తాజగా కరోనాపై పోరాటానికి కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించాడు. చాలా మంది సెలెబ్రిటీస్ సెంట్రల్, స్టేట్ ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చారు. మరోవైపు సినీ కార్మికులను ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సీసీసీ కి విరాళాలు ఇచ్చారు. కానీ మన రౌడీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరో వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చాడు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయడంకోసం రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న వారికోసం రూ. 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసాడు. ఎవరైనా నిత్యావసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న వారు ఈ వెబ్సైట్ లో “http://thedeverakondafoundation.org” ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసుకుంటే చాలు.. వాళ్ళ వాలంటీర్లు మీకు కాల్ చేస్తారు. మీ దగ్గరలో ఉన్న కిరాణా షాపులో సరుకులు తీసుకుంటే షాపు వారికి డైరెక్టుగా వాలంటీర్లు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారట. దాదాపు రెండు వేల కుటుంబాలకు అవసరాలు తీర్చేవిధంగా మిడిల్ క్లాస్ ఫండ్స్ ట్రస్ట్ తీర్చే విధంగా ఏర్పాటు చేశారట.

మిగిలిన డబ్బులతో యూత్ ఎంప్లాయిమెంట్ కోసం ది దేవరకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేసాడు. మరోవైపు విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన మిడిల్ క్లాస్ ఫండ్స్ కు తన వంతు సహాయంగా లక్ష రూపాయిలు సాయం చేసారు హీరో కార్తికేయ. దర్శకుడు కొరటాల శివ కూడా విజయ్ దేవరకొండ చేస్తోన్న ఈ ప్రయత్నానికి తన వంతు సహకారం అందించారు.
No words @TheDeverakonda anna .
— Kartikeya Gummakonda (@ActorKartikeya) April 26, 2020
Huge respect????????
Middle class suffering and unemployment are the biggest threat to us now.
From my side I contribute Rs.1lak to #MCF
I request everyone to donate how much ever possible through https://t.co/7SyS1UzXvs https://t.co/LjhQr7XJIL pic.twitter.com/m9ArDi7aoU



























