Kasthuri tweet on viswak Sen issue : విశ్వక్ సేన్, దేవి నాగవల్లి మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఎవరో ఒకరు వాళ్లిద్దరికి మద్ధతిస్తూ మళ్ళీ ఆ విషయాన్నీ తెరపైకి తెస్తున్నారు. ప్రాంక్ వీడియో గాడి తప్పి విమర్శల పాలైన విశ్వక్ హ్యూమన్ రిసోర్స్ వరకు కంప్లైన్ట్ వెళ్లి రచ్చ జరిగింది. ఇదంతా చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ విశ్వక్ ను ఏకిపారేశారు . అంతటితో విషయం ఆగకుండా టీవీ 9 దగ్గరికి చేరి మరో మలుపు తీసుకుంది.

టీవీ 9 దేవి నాగవల్లి సుసైడ్ ప్రాంక్ పై డిబేట్ చేయడం అందులో విశ్వక్ ను పాగల్ శీను, డిప్రెషన్ పర్సన్ అంటూ వ్యక్తిగతంగా దూషించడం, సరిగా మాట్లాడమని విశ్వక్ అనడం దేవి నాగవల్లి గెట్ అవుట్ అంటూ అరవడంతో విశ్వక్ ఎఫ్ పదంతో బూతులు మాట్లాడాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయి ప్రతి ఒకరు స్పందిస్తూ ఇరువురికీ మద్దతుగా ఇస్తున్నారు.
Nagavalli VS Viswaksen ???????? pic.twitter.com/aTrQYAsnZp
— SuManvitha (@ManviBad) May 2, 2022
మద్దతు తో మళ్ళీ మళ్ళీ తెర పైకి వివాదం….
ఇక తెరాస మంత్రి దానం నాగేందర్ ఈ ఇష్యూ లో దేవి నాగవల్లి కి మద్దతు ఇస్తూ ఘాటుగా స్పందించారు. ఎఫ్ పదం వాడిన విశ్వక్ ను అక్కడే చెప్పుతో కొట్టాల్సిందని ఇలా ప్రతి క్ వీడియోలు మహిళలను కించపరిస్తే భవిష్యత్తులో గుడ్డలుడదీసి పరిగేతిచ్చి కొడతామంటూ హెచ్చరించారు. మరో వైపు నెటిజన్లు విశ్వక్ కు మద్దతుగా నిలిచారు. ఇక ఇపుడు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కస్తూరి,విశ్వక్ కు మద్దతుగా నిలిచారు. హిట్ సినిమా చూసాక నీకు అభిమానిని అయ్యాను ఇక ఈ వీడియో చూసాక నీపై గౌరవం పెరిగిందని ట్వీట్ చేసారు. సెల్ఫ్ మేడ్ స్టార్ అంటూ ప్రశంసించారు. ఇక ఈ విషయంలో నెటిజన్స్ ఆమెను అభినందిస్తున్నారు.
I watched HIT and liked #VishwakSen
— Kasturi Shankar (@KasthuriShankar) May 2, 2022
Today I watched a video and RESPECT @VishwakSenActor .
No prank cud have got him the publicity that TV9 has generated for him!
All the best to a self made star and his new movie #AshokaVanamLoArjunaKalyanam @Vishwaksen_Team pic.twitter.com/5FMQaKemF0































