కత్తి మహేష్ కు కరోనా పాజిటివ్ – ఇదేం శునకానందమంటూ మండిపడ్డ కత్తి మహేష్ !

0
216

కరోనా మహమ్మారి రోజురోజుకీ తన పంజా విసురుతుండటంతో దేశం మొత్తం భయం గుప్పట్లో వణికిపోతుంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇదిలావుండగా కరోనా వైరస్ ఫలానా సెలబ్రిటీకి సోకిందంటూ ఈమధ్య సోషల్ మీడియాలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది. మొన్నటికి మొన్న ప్రముఖ టీవి యాంకర్ ఓంకార్ కి కరోనా సోకినదంటూ ఒక గాసిప్ మీడియాలో షికారు చేసింది.

దాంతో అలాంటిదేమీ లేదని ఆయన “తనకి కరోనా సోకలేదని.. ఇదంతా పుకారు మాత్రమేనని” చెప్పారు. తాజాగా ఈ మహమ్మారి బారిన కత్తి మహేష్ కూడా పడ్డట్టు రూమర్స్ వస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్ కు కరోనా సోకడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారంటూ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ కత్తి మహేష్ స్పందించారు. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా రూమరని.. సెలబ్రిటీలపై లేనిపోని రూమర్లు పుట్టించి ఆనందపడటం శునకానందమని.. ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నవాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here