బాలీవుడ్ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి పెళ్లి గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ వీరి పెళ్లి ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి కోసం రాజస్థాన్ సవాయ్ మధోపూర్ లోని బర్వారాలో పోర్టు కమ్ రిసార్ట్‌లో జరుగనున్నట్లు సమాచారం.

ఇండియా టుడే కథనం ప్రకారం వీరి పెళ్ళికి వచ్చే అతిథులకు ఏ విధమైనటువంటి మొబైల్ ఫోన్స్ అనుమతి లేకుండా ఉండడం కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక ఇప్పటికే కత్రినాకైఫ్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది.ఇందులో భాగంగానే మెహందీ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని అయితే ఈ మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
తన పెళ్లి కోసం కత్రినాకైఫ్ ఏకంగా మెహందీ వేయడానికి రాజస్థాన్ నుంచి జోధ్‌పూర్‌లోని పాలి జిల్లా నుంచి సోజత్ మెహందీ తెప్పించారట. ఈ సందర్భంగా మెహందీ వ్యాపారి సోజత్ మాట్లాడుతూ కత్రినాకైఫ్ మెహందీ తయారు చేయడం కోసమే సుమారు 50 నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. కేవలం మెహందీ కోసమే కత్రినాకైఫ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు అంటే ఇక పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉంటాయి అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.



























