తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సిఎం కెసిఆర్. త్వరలో తెలంగాణాలోని ఉద్యోగులకు ప్రమోషన్లు మరియు ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణాలో ఇప్పటికే 80శతం ఉద్యోగులకు ప్రమోషన్లు జరిగాయని సీఎం కెసిఆర్ తెలిపారు.

ఈ నేపధ్యంలో మిగతా అర్హులైన ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. ఇక వీటితో ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అంతేకాదు వేర్వేరు జిల్లల్లో పని చేస్తున్న ఉద్యోగ మరియు ఉపాద్యాయ భార్యాభర్తలకు అంతర్ జిల్లలో బదిలీలు చేపడతామని తెలిపారు. ఇక మొట్టమొదటి సారిగా VRAలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలను PRC పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. అదే విధంగా రిటైర్మెంట్ వయో పరిమితిని కూడా 61 సంవత్సరాలకు పెంచుతామని పేర్కొన్నారు.





























