Keerthi Chawla : ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి హిట్ స్టూడెంట్ నెంబర్ వన్. అయితే మాస్ హీరోగా స్టామినా చూపిన చిత్రం మాత్రం వినాయక్ డైరెక్టర్ లో వచ్చిన ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆది’. ఆ సినిమాలో యాక్షన్, ఫైట్స్ మాస్ డైలాగులు ఎంత ఫేమస్ అయ్యాయో అలానే హీరోయిన్ తో లవ్ స్టోరీ కూడా అలానే ఆకట్టుకుంటుంది ప్రేక్షకులను. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా తెలుగు తెరకు నూతన పరిచయమైన హీరోయిన్ కీర్తి చావ్లా. తారక్, కీర్తి కెమిస్ట్రీ బాగా వర్క్అవుట్ అయి ఇక కీర్తి గ్లామర్ కూడా సినిమాకు మంచి ప్లస్ అయింది. సినిమా అయితే మంచి సూపర్ హిట్ ని అందుకున్నా కీర్తికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.

గుర్తుపట్టని విధంగా కీర్తి…
ఆది సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత కెరీర్ దూసుకుపోవాలి. నిజానికి కీర్తి విషయంలో మాత్రం అది జరగలేదు. కీర్తికి పెద్ద సినిమా ఆఫర్స్ రాలేదు. ఆది సినిమా తరువాత కాశి, శ్రావణ మాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు అంత సక్సెస్ కాకపోవడంతో ఇక కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది.

దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కీర్తి ఇటీవలే ‘ఓ అమ్మాయి ప్రేమ కథ’ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా కూడా నిరాశనే మిగిలిచ్చింది. అయితే సినిమాలకు దూరమైన కీర్తి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రం తెలియకపోయినా, ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

































