Keerthi Suresh : కీర్తి సురేష్.. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేసినప్పటికీ, తరువాత చదువుపై ద్రుష్టి పెట్టింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి 2013 సంవత్సరంలో మలయాళం సినిమా ‘గీతాంజలి’ ద్వారా సినిమాలకు పరిచయం అయ్యింది. ‘నేను శైలజ’ సినిమా ద్వారా తెలుగు అభిమానులను పలకరించింది. ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తోంది. ఈమె నటించిన సావిత్రి గారి బయోపిక్ ‘మహానాటి’ సినిమాకి గాను నేషనల్ అవార్డు కూడా సంపాదించింది. ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో అలరించింది.

వరస్ట్ ఫ్యాషన్ సెన్స్ అఫ్ ది డే అంటూ…
కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. పక్కింటి అమ్మాయి అనే టాగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్న కీర్తి తాజాగా ఎందుకో రూటు మార్చి గ్లామర్ డోస్ కాస్త పెంచి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమె వేసుకున్న డ్రెస్, ఆ స్టైల్ వారికి నచ్చట్లేదు. ఆ ఫోటోలలో కీర్తి లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ అందులోనూ ఓవర్ సైజు ధరించి ఉంది. ఇక ఆ డ్రెస్ పై భారీగా నగలు కూడా ధరించింది.

ఈ ఫోటోలపై నెటిజన్లు… ఆ కలర్, ఇంకా డ్రెస్ రెండూ నీకు అసలు సూట్ అవ్వట్లేదని, ఇంకా నువ్వు వేసుకున్న డ్రెస్ కి ఆ జ్యువరీ కి, మేకుప్ కు అసలు మ్యాచ్ అవ్వట్లేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా కీర్తి ఫ్యాషన్ సెన్స్ కి ‘వరస్ట్ ఫ్యాషన్ సెన్స్ అఫ్ ది డే’ అనే కాప్షన్ తో తెగ ట్రోల్ చేస్తున్నారు.



























