Keerthi Suresh : అటు కమర్షియల్ సినిమాలు ఇటు కథ ముఖ్యంగా ఉండే సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుని తన నటనకు మహానటి సినిమాకు నేషనల్ అవార్డు సంపాదించిన కీర్తి సురేష్ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విజయం కీర్తి సురేష్ కు చాలా కీలకం. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా హిట్ అయితే కెరీర్ మలుపు తిరగడం ఖాయం. అందుకే కీర్తి ఆశలన్నీ ఇపుడు సర్కారు వారి పాట సినిమాపైనే.

చిన్ని గా కీర్తి…..
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన సాని కాయిదమ్ చిత్రంలో కీర్తి సురేష్‌తోపాటు ధనుష్ అన్న, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో చిన్ని గా రాబోతోంది. పగ ప్రతీకారాల నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో కీలకం పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఓటీటీ లో విడుదలవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మే 6 న విడుదల కాబోతోంది. ఇక కీర్తి హాట్ కామెంట్స్ ఎపుడు వైరల్ అవుతున్నాయి. అవకాశాలు వచ్చిన రాకున్నా కమర్షియల్ సినిమాలు అంత ముఖ్యం కాదని చెబుతోంది కీర్తి. నటిగా ప్రాముఖ్యమున్న పాత్రలో నటించడం తనకు ఇష్టమని, కమర్షియల్ సినిమాలో డబ్బు ఎక్కువ వస్తుందని హద్ధులు దాటి నటించడం తన వల్ల కాదని తెల్చేసింది.
ఈమధ్య కాలంలో హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే చూస్తున్నారు, హీరోయిన్ లో టాలెంట్, పెర్ఫామెన్స్ ను గుర్తించి, మంచి పాత్రలు ఇవ్వడంలేదు. దాంతో హీరోయిన్ అంటే సినిమాకు అలంకార ప్రాయంగా మారింది. అందుకే కీర్తి సురేష్ నటిగా తనను ప్రేక్షకులు ఇష్టపడాలని కోరుకుంటోంది . అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న హీరోయిన్ పాత్రలే తనకు దక్కుతున్నాయి అని కీర్తి సురేష్ చెప్పింది . ఇప్పటి వరకూ అలాంటి పాత్రలు రావడం వల్లే తాను హీరోయిన్ గా ప్రేక్షకులు ఆదరణ పొందుతున్నాని కీర్తి సురేష్ అన్నారు.

































