కీర్తి సురేష్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరేమో.. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న మహానటి. మహానటి సినిమా కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేసింది.. ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో వుంది. తాజగా కీర్తి నటించిన రంగ్ దే చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నెల 26న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ ప్రమోషన్లలో కీర్తి సురేష్ బిజీగా ఉంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మంచిమనిషి అయి వుండాలని, అతనిలో మానవత్వం మెండుగా ఉండాలని చెప్పింది. అయితే ప్రస్తుతానికి తాను పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదని కానీ సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయని తెలిపింది. తన పెళ్లి తనకు తెలియకుండానే మూడు, నలుగు సార్లు చేసారని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి తన పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉందని ఇప్పుడే దానిగురించి ఆలోచించాల్సిన పనిలేదని తెలిపింది కీర్తి సురేష్.



























