KGF 2 : కే జీ ఎఫ్ ఈ సినిమా ఒక సంచలనం . అంచనాలు లేకుండా విడుదలయి ఇండియా మొత్తం ఉపేసింది. కన్నడ సినిమా సత్తాను ఇండియా కు చూపింది. అసలైన పాన్ ఇండియా సినిమాగా నిలిచి రికార్డులు బద్ధలుకొట్టింది. ఇక యష్ కెరీర్ ను మలుపు తిప్పిన కే జీ ఎఫ్ ఇపుడు రెండో భాగం విడుదలకు సిద్ధమవుతోంది.

కేజీఎఫ్ రెండో భాగం కోసం భారీగా అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు. ఇక సినిమా నుండి విడుదలైన తూఫాన్ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక ట్రైలర్ సగటు ప్రేక్షకుడిని అకట్టుకుంటోంది.అందులో యష్ సంభాషణలు మరింత అకట్టుకున్నాయి. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే యష్ రాకింగ్ పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
ప్రచార కార్యక్రమాలు షురూ చేసిన చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేసారు. ఇక పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలు చెప్పారు. యష్ లో ఉన్న ప్రతిభ కు సంబంధించి షాకింగ్ విషయాలు చెప్పారు. సినిమా ట్రైలర్ లో వైలెన్స్.. వైలెన్స్… అంటూ సాగే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సంభాషణలు రాసింది యష్ అని చెప్పి అందరిని షాక్ కు గురి చేసారు ప్రశాంత్ నీల్.ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.
































