“కెజిఎఫ్” సైలెంట్ గా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. యాశ్ అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీకి తప్ప వేరే ఇండస్ట్రీలకు తెలియని పేరు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఒక్కసారిగా నేషనల్ హీరో ని చేసింది. ఈ చిత్రం రెండవ భాగం కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ఇచ్చిన జోష్ తో రెండవ భాగాన్ని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మొదటి భాగంలో పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోయినా చిత్రం బాక్సాఫీసు వద్ద పరుగులు పెట్టింది. అయితే రెండవ భాగంలో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి భారీ తారాగణం తో తెరకెక్కుతుంది. మన తెలుగు నటుడు రావు రమేష్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కెజిఎఫ్ 2 అక్టోబర్ 23 న వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ లాక్ డౌన్ నేపధ్యంలో అనుకున్న సమయానికి రావడం కష్టమే అనిపిస్తుంది. అదలావుంటే తాజాగా కెజిఎఫ్ చిత్రాన్మి ఒక తెలుగు లొకల్ చానెల్ ప్రసారం చేయడం వివాదాస్పదంగా మారింది. దీనితో ఆ చానెల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు. ఈమేరకు కెజిఎఫ్ నిర్మాత కార్తీక్ గౌడ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. చట్ట విరుద్దంగా తమ సినిమాను ఎవ్రీ అనే లోకల్ చానెల్ ప్రసారం చేసిందని, దానికి సంబందించిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here